దివ్యాంగుల పట్ల కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆరోపించారు. మంగళగిరి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రీ-వెరిఫికేషన్ పేరుతో పింఛన్లు తొలగించడం వల్ల దివ్యాంగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి మానవత్వం లేదని అప్పిరెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం పెన్షన్లు తొలగించడం వల్ల ఎంతోమంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారని తెలిపారు..