కాసిపేట మండలంలోని దేవపూర్ ఘట్రావుపల్లి రేగులగూడ జెండాగూడ సాలెగూడా సోనాపూర్ వెంకటాపూర్ తదితర ఆదివాసి గూడెంలలో వెంటనే పారిశుద్ధం పనులు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖే రవి డిమాండ్ చేశారు ఆదివాసి గూడెంలలో పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసులు ఎన్ని ఏళ్లు మురుగులో బతకాలని ప్రశ్నించారు ప్రతి గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని దోమల మందు కొట్టాలని కోరారు ప్రభుత్వం అధికారులు జోక్యం చేసుకొని ఆదివాసుల ప్రాణాలు కాపాడడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు