నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు పడటంతో చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కమ్మర్‌పల్లి మండలం కోనాపూర్‌లో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రాళ్ల వాగు ప్రాజెక్ట్‌లోకి భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టు నిండి అలుగు పారుతోంది. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.