KFCలో కుళ్లిపోయిన చికెన్ లెగ్ పీస్ రావడంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఈ ఘటన నిజామాబాద్‌లోని ఓ మాల్‌లో చోటుచేసుకుంది. అయితే కొందరు కస్టమర్లు KFC ఆర్డర్ చేయగా లెగ్ పీస్ దుర్వాసన వచ్చింది. దీంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చికెన్ తినడం వల్ల తమ ఆరోగ్య పరిస్థితి ఏంటని నిలదీశారు. మంగళవారం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.