క్లౌడ్ బరస్ట్ మూలంగా కురిసిన భారీ వర్షాల్లో రాష్ట్ర మొత్తం అతలాకుతలమైందని రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షు కార్యదర్శులు ప్రభాకర్ దేవారాములు డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవనంలో మంగళవారం సాయంత్రం 4 10 విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గత నాలుగు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయారని మొక్కజొన్న వరి సోయా చేతికి వచ్చే టైం లో పూర్తిగా నీటిపాలైందని ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.