Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: జిల్లా సైనిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవ క్లినిక్ ను ప్రారంభించిన జిల్లా జడ్జి ఎం నాగరాజు

Nalgonda, Nalgonda | Aug 26, 2025
నల్గొండ జిల్లా కేంద్రంలోని సైనిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయ సేవ క్లినిక్ ను జిల్లా జడ్జి ఎం నాగరాజు మంగళవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశ రక్షణ కోసం సైనికులు చేసిన త్యాగాలు అమూల్యమని సైనికులు, మాజీ సైనికులు లేదా వారి కుటుంబ సభ్యులకు ఎటువంటి న్యాయపరమైన సమస్య వచ్చిన ఉచితంగా న్యాయ సలహాలు పొందవచ్చని సూచించారు. ప్రతి శనివారం ఈ క్లినిక్ లో ఒక న్యాయవాది, వాలంటీర్ న్యాయవాది సేవలందిస్తారని తెలిపారు. ఈ క్లినిక్ లో తమ సమస్యలను వివరించి న్యాయ సలహాలు పొందవచ్చని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us