కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం.. గణేష్ పండగకు మార్కెట్లో ఇబ్బందులు వినాయక చవితి పండుగ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాకేంద్రంలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షం ప్రజలను ఇబ్బందులకు గురిచేసింది. పండుగకు కావాల్సిన సామగ్రి కొనుగోలుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా మార్కెట్లో పూజా సామగ్రి విక్రయించే వ్యాపారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆనందోత్సాహాల మధ్య వినాయక చవితి సంబరాలను జరుపుకుందామనే ఉత్సాహంతో గణేష్ మండపాలను ఎంతో ఖర్చు భరించి అలంకరణ చేసుకున్న భక్తులు, నిర్వాహకులను వర్షం నిరుత్సాహపరిచింది.