అన్నమయ్య జిల్లా, మదనపల్లె పట్టణంలో ద్విచక్ర వాహనాలలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను శక్తి టీం సిబ్బందితో శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించి వారికి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ చేశారు. ఈ సందర్భంగా సిఐ రాజారెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. కళాశాలలలో ఈవ్ టీజింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పదని ఆయన హెచ్చరించారు.