నాగర్ కర్నూలు జిల్లా డిటిఓ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి బాధ్యులను సస్పెండ్ చేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ మంగళవారం మధ్యాహ్నం డిటిఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు . డి టి ఓ కొన్ని వేల డ్రైవింగ్ లైసెన్సులు టెస్టులు లేకుండానే జారీ చేశారని వందల పాత ట్రాక్టర్ ట్రాలీలకు మళ్లీ రిజిస్ట్రేషన్ చేశారని కార్యాలయంలో ఇద్దరు ఏ ఎం బి ఐ లు ఉండగా వారికి ఆఫీసులో పని కేటాయించకపోవడంతో వారు కార్యాలయాన్ని సరిగా హాజరు కావడం లేదని బిఎస్పీ నేతలు ఆరోపించారు స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఎగరవేసేందుకు హాజరు కాలేదని ఆరోపించారు