మంబాపూర్ ఎస్వీఎస్ పరిశ్రమలో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అందజేశారు. గుమ్మడిదల మండలం మంబాపూర్ పరిధిలోని ఎస్వీఎస్ రెఫకంప్ పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అభిషేక్ (21) రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందాడు. యాజమాన్యంతో ఎమ్మెల్యే చర్చించి బాధిత కుటుంబానికి నష్టపరిహారం అందజేశారు.