దార్లపూడి 32/11కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో కొత్తలి, ఏటికొప్పాక ఫీడర్ల పరిధిలోని లైన్ల నిర్వహణ పనుల కారణంగా మంగళవారం కొత్తలి, పేరంటాళ్లపాలెం, ములకలాపల్లి, మన్యంపాలెం, ఏటికొప్పాక గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని అనకాపల్లి ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.రాజశేఖర్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.