పత్తికొండ నియోజకవర్గం క్రిష్ణగిరి మండలంలోనిపుట్లూరులో ఈనెల 26న రాత్రి జరిగిన ఘర్షణలోగాయపడిన ఉప్పరి మౌలాలి (58) శనివారంమృతి చెందినట్లు ఎస్సై జి. కృష్ణమూర్తి తెలిపారు. పొలం విషయంలో ఉప్పరి మౌలాలి,ఉప్పరి గౌరమ్మ దాయాది కుటుంబ సభ్యులమధ్య గొడవ జరిగింది. మౌలాలి తీవ్రంగాగాయపడగా కర్నూలు సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్దుర్తి సీఐ మధుసూదన్ రావు తెలిపారు.