కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం పట్టణంలో ఆటో డ్రైవర్ అందరూ కలిసి నిరసనర్యాలీ కార్యక్రమం శుక్రవారం ఉదయంనిర్వహించారు. ఈకార్యక్రమంలో భాగంగా ఆటోయూనియన్ నాయకులు మాట్లాడుతూ,కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు అని ప్రకటించడంతో, ఆటో డ్రైవర్ రోడ్డున పడ్డారు అని, ఆటో డ్రైవర్లకు కనీసం రోజుకు 100 రూపాయలు సర్వీసులు కూడా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక దర్గా సెంటర్ వద్ద నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోకు వినతి పత్రాన్ని అందజేశారు, ఆటో డ్రైవర్లను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.