జగిత్యాల జిల్లా,కొడిమ్యాల మండలం,దొంగలమర్రి స్టేజి సమీపంలో 2 ద్విచక్ర వాహనాలు గురువారం 9:10 PM కి ఢీకొని రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన చోటుచేసుకుంది, వేములవాడకు చెందిన మహమ్మద్ రహీం తన ద్విచక్ర వాహనంపై జగిత్యాలకు వెళ్తుండగా,మోహన్ రావు పేట కు చెందిన నరేష్ తన ద్విచక్ర వాహనంపై పూడూరుకు వెళ్తుండగా,దొంగలమర్రి స్టేజి సమీపం వద్దకు రాగానే నరేష్ ద్విచక్ర వాహనంతో ముందున్న ఆటోని ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న రహీం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు,దీంతో పడిపోయిన ఇరువురు ద్విచక్ర వాహనదారుల కు తీవ్ర గాయాలు కాగా ఇద్దరిని 108 వాహనంలో స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు,