మద్యం తాగి హైడ్రామా సృష్టించారు: ఎమ్మిగనూరు ఎమ్మెల్యే..వైసీపీ నేతలు పురుగు మందు డబ్బాలో మద్యం పోసుకొని తాగి హైడ్రామా సృష్టించారని ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేస్తుంటే వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలిపారు. ఉల్లికి మద్దతు ధర ఇస్తున్నా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. సూపర్-6 విజయంతో వైసీపీ నేతలకు భవిష్యత్తు లేకపోవడంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.