కరెంట్ షాక్ తగిలి రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగులో శనివారం సాయంత్రం 4:00 లకు చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం .. గ్రామానికి చెందిన సాయి అనే రైతు తన వ్యవసాయ మోటార్ రిపేర్ కోసం దగ్గరలోని విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఆఫ్ చేసేందుకు వెళ్లగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.