నూతన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టర్ ప్రావీణ్యకు గురువారం క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. జేఏసీ జిల్లా ఛైర్మన్ జావిద్ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న సీపీఎస్ విద్రోహదినం సందర్భంగా నిరసన కార్యక్రమాన్ని కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సిపిఎస్ విధానం రద్దు చేసే వరకు ఐక్య పోరాటం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.