గంట్యాడ మండలం కొటారుబిల్లి జంక్షన్లోని మన గ్రోమోర్ ఎరువుల వికయ కేంద్రానికి 12 టన్నుల యూరియా నిల్వలు వచ్చిన నేపథ్యంలో, శనివారం మధ్యాహ్నం గంట్యాడ మండల వ్యవసాయాధికారి బి శ్యాం కుమార్ పర్యవేక్షణలో పోలీస్ బందోబస్తు నడుమ రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేశారు. వన్ బి ఆధార్ కార్డు తో వచ్చిన రైతులను క్యూలో నిల్చోబెట్టి నెంబర్లు వారిగా టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క యూరియా బస్తా ను పంపిణీ చేశారు. పోలీస్ వ్యవసాయ శాఖ రెవిన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.