మేకల దొంగను పట్టుకుని అరెస్టు చేసిన సంఘటన సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, కేసు వివరాలు తెలియపరుస్తూ.. మంగళవారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ కు చెందిన వొళ్లెపు శేఖర్ తన ఇంటి బాత్రూం లో 5 మేకలను పెట్టి డోర్ పెట్టి ఇంట్లో పడుకోని ఉదయం లేచి చూడగా రాత్రి ఎవరో గుర్తు తెలియని దొంగ తన మేకలను దొంగిలించినారని దరఖాస్తు ఇవ్వగా ఎస్ఐ ఆసిఫ్, కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు. ఎస్ఐ ఆసిఫ్, సిబ్బందితో కలిసి కేసు పరిశోధనలో భాగంగా సిద్దిపేట అంగడిలో వెతుకుతుండగా కేసీఆర్ నగర్ డబుల్ బెడ్ రూం కాలనీకి చెందిన వొర్సు కృష్ణ