మంగళవారం సాయంత్రం ఐదు గంటలకు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ మోర్చా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్ తెలంగాణ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షునిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హామిలీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒక్కసారి తప్ప ఏ హామీని అమలు చేయకుండా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఆయన ప్రశ్నించారు.