తంబళ్లపల్లెలో 65.3% రేషన్ పంపిణీ పూర్తి: అన్నమయ్య జిల్లాలోని తంబళ్లపల్లె మండల వ్యాప్తంగా 65 ఏళ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు గురువారం సాయంత్రానికి 65.3% రేషన్ సరుకులు పంపిణీ చేసినట్టు డీటీ చాణక్య తెలిపారు. మండలంలో 65 ఏళ్లు పైబడిన వారు, మంచానికే పరిమితమైన వికలాంగులు 1889 మంది ఉండగా.. 1235 మంది ఇళ్లకు వెళ్లి రేషన్ అందజేసినట్టు చెప్పారు. మిగిలినవారికి కూడా ఇళ్లవద్దకే వెళ్లి రేషన్ అందజేస్తా మన్నారు. శుక్రవారం ఉదయం 8 నుంచి సాధారణ కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తామన్నారు.