హైదరాబాదు నుండి ఆదిలాబాద్ జిల్లాకు వస్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రానికి చెందిన ఏనుగు నరసింహా రెడ్డి అనే యువకుడు దుర్మరణం చెందాడు. హైదరాబాద్ నుండి కారులో ఏనుగు నరసింహా రెడ్డి, విశాల్ అనే ఇద్దరూ యువకులు ఇచ్చోడ కు వస్తున్న క్రమంలో మంగళవారం నిర్మల్ జిల్లా ఇందల్వాయి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో నర్సింహా రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాగా, విశాల్ కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.