నల్గొండ జిల్లా, చింతపల్లి మండల పరిధిలోని తిరుమలాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాములు అనే వృద్ధుడు గ్యాస్ సిలిండర్ పేలి మృతి చెందాడు. శుక్రవారం మధ్యాహ్నం చింతపల్లి ఎస్సై రామ్మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి నిద్రిస్తున్న సమయంలో రాములు అనే వృద్ధుడు గ్యాస్ సిలిండర్ పేలి ఇంటి పైకప్పు మీద పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కాగా మనవడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై రామ్మూర్తి తెలిపారు.