బద్దిపల్లెలో మహిళ అనుమానాస్పద మృతి కురబలకోట మండలంలో మహిళ అనుమాన స్పదస్థితిలో మృతి చెందడం శుక్రవారం సాయంత్రం జరిగింది. ముదిపేడు ఎస్సై దిలీప్ కుమార్ కథనం మేరకు.. మండలంలోని ముదివేడు పంచాయితీ, బద్దిపల్లెకు చెందిన ఆనందరెడ్డి భార్య అశ్విని (27) ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని అశ్విని తల్లి దండ్రులకు ఆరోపించారు. కరెంట్ షాక్ తగిలిందని సమాచారం రావడంతో తాము కూతురు ఇంటికి వెళ్లిచూడగా ఉరి వేసుకున్నట్లు ఉందన్నారు