అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం పరిధిలోని కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేశారు. సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఆలయ ప్రధాన తలుపులు మూసివేశారు. అర్చకులు, వేద పండితులు చంద్ర గ్రహణం సందర్భంగా ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆలయ తలుపులు మూసి తాళాలు వేసారు. ఈ సందర్భంగా ఆలయంలో సోమవారం వేకువ జామున 4.30 గంటల నుంచి సంప్రోక్షణ, శుద్ధి చేసి 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తామని ఈఓ విజయరాజు తెలిపారు.