అన్నమయ్య జిల్లా చిట్వేల్, ఓబులవారిపల్లి మండలం లోని వివిధ గ్రామాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన మొత్తం 2,73,196 రూపాయల విలువైన చెక్కులను ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లి గురువారం అందజేశారు. చిట్వెల్ మండలం తిమ్మయ్యగారి పల్లి కి చెందిన సింగన రుక్మిణమ్మ కు 1,40 వేలు, చిట్వేల్ పట్టణం కు చెందిన గడ్డం చలపతి కి 25,166 రూపాయలు,ఓబులవారిపల్లి పట్టణం కు చెందిన సింగయ్య గారి రాజమ్మ కు1,08,030 రూపాయల చెక్కు అందజేశారు.