మడకశిర మండలం చందకచెర్ల లో శుక్రవారం వినాయకుని నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్లో వినాయకుడిని ఊరేగింపుగా నిమజ్జన ప్రదేశానికి తీసుకెళ్లారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన యువత రంగులు చల్లుకుంటూ పాటలకు డ్యాన్సులు వేస్తూ వేడుకగా నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.