ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై ధర్మవరం ఎమ్మెల్యే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు.ఆదివారం మదనపల్లిలో నిర్వహించిన ఓ సమావేశంలో సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ వైయస్ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకే పరిమితం చేసిన ఇంకా బుద్ధి రాలేదు అన్నారు. ఎంతసేపు సోషల్ మీడియాలో డబ్బులు ఇచ్చి తనపై ముఖ్యమంత్రిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్య పదజాలంతో పోస్ట్ పెట్టిస్తున్నాడన్నారు. ఈవీఎం లతో గెలిచారని తమపై అంటున్న జగన్మోహన్ రెడ్డి పులివెందులలో ఏరకంగా గెలిచాడో చెప్పాలంటూ ప్రశ్నించారు.