సిరిసిల్ల పట్టణంలో నేడు జరిగే గణేష్ నిమజ్జన కార్యక్రమాలకు భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాంతాలలో గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. నిమజ్జనం విజయవంతంగా పూర్తి అయ్యేవరకు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించేందుకు ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. ప్రధాన కూడలలో ట్రాఫిక్ జామ్ కాకుండాప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. వినాయకులను సమయానికి నిమ