రాష్ట్రంలో యూరియా కొరత తీర్చి రైతుల పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంతకల్లు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట మంగళవారం అన్నదాత పోరు కార్యక్రమంలో భాగంగా ఆర్డీఓ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగన్ సీఎం గా ఉన్నప్పుడు గ్రామాల్లోనే రైతులకు యూరియా అందించారని అన్నారు. యూరియా కొరత తీర్చాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు