ఆక్వాజోనైజేషన్ నిర్ణయంలో కచ్చితత్వంతో కూడిన ప్రతిపాదనలను సిఫార్సు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత కమిటీలను ఆదేశించారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరం నందు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆక్వా జోనైజేషన్ ప్రకటన కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గ్రామ, మండల కమిటీలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్వా జోనైజేషన్ కు ప్రతిపాదించిన నివేదికలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి మార్పులు, చేర్పులు, తిరస్కరణకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.