ఎల్లారెడ్డి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా అంధత్వ నివారణ సంస్థ, బాన్సువాడ లయన్స్ కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మోతిబిందు నిర్ధారణ, కంటి పరీక్షలు నిర్వహించారు. ప్రభుత్వ నేత్ర వైద్య సహాయ అధికారి బి. హరికిషన్ రావు ఆధ్వర్యంలో 49 మందికి కంటి పరీక్షలు చేయగా, 8 మందికి మోతిబిందు ఉన్నట్లు గుర్తించారు. వీరికి బాన్సువాడ లయన్స్ కంటి ఆసుపత్రిలో ఐఎల్ కంటి ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.