పలమనేరు: పట్టణానికి చెందిన రఫీ తెలిపిన సమాచారం మేరకు. గుడియాత్తం రోడ్డు నందు నడుచుకొని వెళ్తుండగా నలుగురు యువకులు నన్ను తీవ్రంగా కొట్టి నా దగ్గర ఉన్న సుమారు 15 వేల రూపాయల నగదు మొబైల్ ఫోను తీసుకుని ఉడాయించారు, నాకు తలకు ఏడు కుట్లు పైన పడ్డాయన్నారు. దీనంతటికీ కారణం నలుగురు యువకులే అంటూ ఆరోపించారు. రఫీ మనవడు సైతం నలుగురు యువకుల పైన ఆరోపించాడు. ఘటనపై పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.