రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి సభఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. బై ఎలక్షన్ల కోసమో, రాజకీయ లబ్ధికోసమో రేషన్ కార్డులను ఇవ్వడం లేదన్నారు. 95 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇస్తామన్నారు. 3.10 కోట్ల మందికి సన్న బియ్యం అందిస్తున్నామన్నారు. సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ.13 వేల కోట్లు ఖర్చు పెడుతోందన్నారు.