గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలోని సీఆర్డీఏ కార్యాలయానికి విద్యుత్ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేశామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. బుధవారం కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, రెండు మెగావాట్ల విద్యుత్ అవసరమని, రేపు సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని మీడియాతో అన్నారు. రాజధాని ప్రాంతంలో ఏ ప్రభుత్వ భవనానికైనా విద్యుత్ సరఫరా వెంటనే చేస్తామని మంత్రి రవికుమార్ తెలిపారు.