శ్రీకాకుళం జిల్లా పలాస మండలం కేసు పురం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన వేళ ఘోర సంఘటన చోటుచేసుకుంది. చిల్లంగి నెపంతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములు (80) అనే వృద్ధుడిని అతి దారుణంగా రాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు (35) వ్యక్తి ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలు ప్రాంతాల్లో ఉన్న దాసుల వద్దకు వెళ్ళగా..గ్రామానికి చెందిన వ్యక్తి చేతబడి చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు. శ్రీరాములే చేతబడి చేశారని సంతబొమ్మాలి మండలం బోరుభద్ర గ్రామానికి చెందిన దాసుడు తెరపడంతో ఈ ఘాతకానికి ఒడిగట్టారని మృతిని మనవడు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.