కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణ చేపట్టినా, బీఆర్ఎస్ అధిష్ఠానం పిలుపుమేరకు మక్తల్ నియోజకవర్గం ఆత్మకూర్ గాంధీ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా అమరచింత బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ, సీబీఐ విచారణలో కేసీఆర్ కడిగిన ముత్యంలాగా బయటికి వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వీరేశలింగం, లక్ష్మీకాంత్ రెడ్డి, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.