వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చీరాలలో అన్నదాత పోరు కార్యక్రమం జరిగింది.రాష్ట్రంలో యూరియా కొరత,ఎరువుల బ్లాక్ మార్కెట్ ను నిరసిస్తూ వైసీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి.ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున,చీరాల ఇన్చార్జి కరణం వెంకటేష్ తదితర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు.టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.చివరగా ఆర్డీవో చంద్రశేఖర నాయుడుకి వినతిపత్రం సమర్పించారు.