చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదవారి సొంతింటి కల నెరవేరబోతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బెడాలపాడు గ్రామంలో జరగబోయే ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల ఏర్పాట్లను గృహనిర్మాణ శాఖ ఎండి వి. పి. గౌతమ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్యతో కలిసి మంత్రి మంగళవారం పరిశీలించారు.