మనోపాడు మండల పరిధిలోని ప్రధాన రహదారిపై ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి కింద గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు నిలవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు ప్రయాణికులు ప్రయాణాలు సాగించేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. రైల్వే ట్రక్కులను దాటుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు.తక్షణమే అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద నీరు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.