గుంటూరు నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న ప్రకటనల స్క్రీన్ల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి అన్నారు. మున్సిపాలిటీ, ట్రాఫిక్ పోలీసులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారని ఆమె తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే మాధవి మాట్లాడారు. ట్రాఫిక్ అవగాహన కంటే ప్రకటనలే ఎక్కువగా వస్తున్నాయని, వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె మేయర్ను కోరారు. ఈ సమస్యపై కౌన్సిల్ సమావేశంలో చర్చించాలని ఆమె కోరారు.