అనంతపురం పట్టణానికి చెందిన వైకాపా సీనియర్ నాయకుడు తోపుదుర్తి భాస్కర్ రెడ్డి నిన్న గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సి డబ్ల్యూ సి మెంబర్ ఎన్ రఘువీరా రెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భాస్కర్ రెడ్డి సతీమణి తోపుదుర్తి కవిత జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు అప్పట్లో భాస్కర్ రెడ్డితో అన్ని పార్టీలకు సంబంధించిన వారు సత్సంబంధాలు ఉండేవాడిని రాజకీయాల్లో భాస్కర్ రెడ్డిని ఆజాతశత్రువుగా పరిగణిస్తారని ఆయన భావోద్వేగంతో అన్నారు.