బొండపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, గొట్లాం గ్రామంలోని రైతు సేవా కేంద్రం ఎరువుల విక్రయ కేంద్రాలను గురువారం మధ్యాహ్నం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ఎరువుల స్టాక్, సేల్స్ బుక్ ల తో పాటు పలు రికార్డులు తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను పరిశీలించారు. తనిఖీలలో బొండపల్లి మండల వ్యవసాయాధికారి మల్లికార్జునరావు, ఏఈఓ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.