ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పివిపురం గ్రామంలో భార్యను గొంతు కోసి హత్య చేసిన ఘటనలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు హత్య తర్వాత నంద్యాల వైపు పారిపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. భార్యను గొంతు కోసి హత్య చేసిన నిందితుడు వెంకటేశ్వర్లను పట్టుకునేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు కంభం సర్కిల్ సీఐ మల్లికార్జున వెల్లడించారు. అనుమానంతో వెంకటేశ్వర్లు భార్యను హత్య చేసినట్లు తెలిపారు.