రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో వడ్ల కొనుగోలు లేక రైతులు బుధవారం రోడ్డెక్కారు. నిమ్మపల్లి ఎక్స్‌రోడ్ వద్ద రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇప్పటికీ వడ్లు కొనుగోలు చేయకపోవడంతో తాము నష్టాల్లో కూరుకుపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెచ్చిన ధాన్యం తడవడంతో నాణ్యత కోల్పోతుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు స్పందించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.నిరసనలో భాగంగా రైతులు చేతుల్లో మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి తమ నిరసన తెలిపారు.