జగిత్యాల జిల్లా,మల్యాల మండల కేంద్రంలో బ్లాక్ చౌరస్తా నుంచి అంగడి బజారుకు వెళ్లే దారిలో,మంగళవారం 1:30 PM నుండి మొదలుకొని 4:30 PM వరకు దాదాపు మూడు గంటలకు పైగా,వందల సంఖ్యలో కోతులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ గ్రామంలో పలువురుపై దాడి చేస్తూ బీభత్సం సృష్టించాయి,ఇండ్లలోకి చొరబడి ఇద్దరిపై దాడి చేశాయి, వస్తువులు ఎత్తుకెళ్తున్న స్థానికంగా ఉన్న ప్రజలపై వాహన దారులపై ఎగబడుతూ దాడులకు పాల్పడుతున్నాయి, దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు, అధికారులు వెంటనే స్పందించి కోతుల బెడద నుంచి రక్షించాలని కోరుతున్నారు స్థానికులు,