2024 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరిన వాసిరెడ్డి ప్రసన్న రాధిక అనే మహిళ నాయకురాలు తమ వద్ద లక్షల రూపాయలు అప్పుగా తీసుకొని ఇప్పటివరకు చెల్లించకుండా కాలం వెల్లబుచ్చుతుందని గుంటూరు నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు పెన్నాటి మల్లేశ్వరి, రాయుడు శ్రీలక్ష్మి అనే మహిళ నాయకురాలు ఆరోపించారు. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో టిడిపి నాయకురాలు పెన్నాటి మల్లేశ్వరి, రాయుడు శ్రీలక్ష్మి మాట్లాడారు.