Parvathipuram, Parvathipuram Manyam | Jun 23, 2025
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి కే. హేమలత అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె ఆయా జిల్లా శాఖల అధికారులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాసంకల్ వ్యాధికుల వచ్చిన ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. మరల మరల ఫిర్యాదుదారులు రాకుండా అర్జీలను పరిష్కరించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ అధికారి జెడిపాల్, రెవెన్యూ అధికారులు శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.