చివ్వెంల మండలం గుంజలురు స్టేజి వద్ద ఆటోను కారు ఢీకొట్టడంతో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన ఈరోజు జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేటకు చెందిన నూకల సత్యనారాయణ ఈరోజు పాత ఇనుము సామాను కొనుగోలు చేసి వెళ్తున్న క్రమంలో అతివేగంగా వచ్చిన కారు ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కుమారుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.