తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి అందరికీ ఆదర్శం అని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వినాయక్ నగర్ లో గల ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్, అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా శాఖల అధికారులు, వివిద కుల సంఘాల ప్రతినిధులు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ స్ఫూర్తిదాయకమైన పోరాటం చేశారని గుర్తు చేశారు.